Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలి న‌డ‌క‌న కొండెక్కి శ్రీవారిని ద‌ర్శించుకున్న ఉప్పెన హీరో, హీరోయిన్.. ఫొటోలు, వీడియో వైర‌ల్

uppena team visits ttd
  • తొలి సినిమాతో హిట్ కొట్టిన వైష్ణ‌వ్ తేజ్‌
  • శ్రీవారికి వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు పూజ‌లు
  • సినిమా స్క్రిప్ట్‌ను శ్రీవారి పాదాల వ‌ద్ద పెట్టినందుకే హిట్: బుచ్చిబాబు
హీరో వైష్ణవ్‌ తేజ్ తొలి సినిమా ఉప్పెనతో హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నాడు. హీరోయిన్ కృతి శెట్టికి ఈ సినిమా ద్వారా మ‌రిన్ని సినిమా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఉప్పెనలా ఉప్పొంగుతున్న సంతోషంలో ఉన్న ఈ సినిమా యూనిట్ ఈ రోజు తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకుంది.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు, తదితరులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. హీరో, హీరోయిన్లు కాలినడకన కొండెక్కడం గ‌మ‌నార్హం. వారు కొండెక్కుతుండ‌గా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.
     
బుచ్చిబాబు ఆలయం వెలుపల ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందామ‌ని, అందుకే ఈ సినిమా విజ‌యం సాధించింద‌ని చెప్పారు.

దీంతో తాను తీయ‌నున్న తదుపరి సినిమా స్క్రిప్ట్‌ను కూడా శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందానని తెలిపారు. ఈ సినిమా వివ‌రాల‌ను త్వరలోనే చెబుతాన‌ని వెల్ల‌డించారు. కాగా, ఉప్పెన సినీ బృందంతో  తుడా చైర్మన్‌ చెవి రెడ్డి కూడా ఉన్నారు.
 

TTD
uppena
vishnav tej

More Telugu News